దోపిడీ తెలంగాణ

💐 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐


 దోపిడి తెలంగాణ


   👉🏻తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు,బుల్లెట్ దెబ్బలు తిన్న విద్యార్థులు ఎక్కడ? 

  👉🏻ఉద్యమంలో రక్తము ఏరులై పారిన విశ్వ విద్యాలయాల(OU,KU,TU)కు ఏం న్యాయం చేశారు.
   
    👉🏻తెలంగాణ నిరుద్యోగులను సోమరిపోతులు చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం!

   👉🏻పోరాటం చేసింది విద్యార్థులు ఫలితం పొందు తుంది వెలమల వర్గం, రాష్ట్రాన్ని చూస్తుంటే పద్మనాయక వెలమల పాలనను తలపిస్తోంది.

👉🏻నీళ్లు నిధులు నియామకాలు ఏవి.
 
  👉🏻 నీళ్ల ముచ్చట తీసుకుంటే కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొదట లబ్ది పొందిన వ్యక్తి కెసిఆర్, అది ఎలా అంటే కాళేశ్వరం నుండి ఎత్తిపోతల ద్వారా కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు చేర్చి దానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫామ్ హౌస్ కి నీళ్లు చేర్చుకున్న ప్రజా నాయకుడు కెసిఆర్.

   👉🏻 ఇక నిధుల ముచ్చట మిగులు బడ్జెట్ తెలంగాణ ను అప్పుల రాష్ట్ర మార్చిన గొప్ప ఆర్థిక వేత్త కెసిఆర్, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెగా(meil) కంపెనీ ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పారిశ్రామికవేత్త కెసిఆర్.

    👉🏻 ఇగ నియామకాలు PhD లూ చేసిన విద్యార్థులను సైతం బర్రు,గొర్రు కొనిచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన గొప్ప విద్యావేత్త కెసిఆర్.
    

   👉🏻ఇప్పటికైనా నా తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థులు యువకులు అందరూ ఒక్కటి కావాలి అని కోరుకుంటూ.......

                          ఇట్లు
                   కె యు విద్యార్థి.

 దోపిడి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

కోపం...

కోపం రావడం మానవ సహజం. 
అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత...

నేను
మీ
దేవేందర్ బండారి😎

అధికారం...

అధికారం వుంటేనే గొప్పవారు కారు - దాన్ని వినియోగించే తీరును బట్టి గొప్పవారవుతారు

నేను☝️
మీ✍️
దేవేందర్ బండారి😜

అసూయ...

మీ హృదయంలో ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది...
కనుక అసూయకు దూరంగా ఉండండి...

నేను☝️
మీ✍️
దేవేందర్ బండారి 😉

మనలోని మంచి


అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే... మనలోని మంచి పెరుగుతుంది...

నేను☝🏻
మి✍🏻

దేవేందర్ బండారి😎💐

నేటి సమాజం

మనం కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటిపండ్లే తీసుకుంటాయి ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు అదే విధంగా మనుషులను డబ్బులు కావాలా ఆరోగ్యం అంటే డబ్బులు అంటున్నారు కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు...


నేను☝️
మీ✍️
దేవేందర్ బండారి😉

నేటి సమాజ ధోరణి

గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒక్కటే అని రాసి ఉంటుంది...
ఇంకొంచెం ముందుకి వెళితే అక్కడ " శీఘ్రదర్శనం, ప్రత్యేకదర్శనం, సర్వదర్శనం "అని రాసి అక్కడ మన స్థాయికి తగిన ధర పెట్టి ఉంటారు...
మనుషులంతా ఒక్కటే అయినప్పుడు వ్యత్యాసాలు ఎందుకు?
ఉన్నవాడు..
లేనివాడు...
పేదవాడు అని మీరే నిర్ణయిస్తునప్పుడు ఆ నీతి కథలు ఎందుకు?
సమానత్వం గుడిలోనే లేనప్పుడు ఇంకా బడిలో...
సమాజంలో ఎందుకు దొరుకుతుంది...?

మారండయ్య...
కొంచెం
మానవత్వంతో బ్రతకండి..!

నేను☝🏻
మీ✍🏻
🙏🏻దేవేందర్ బండారి🙏🏻
ఒక్కటి గుర్తుపెట్టుకో...
ఎంతటి ధనవంతుడైనా ఎంతటి ఖరీదైన ఫోన్ కొన్నా...

ఫోన్ ఛార్జింగ్ మాత్రం 💯శాతం కన్నా ఎక్కువ ఛార్జ్ చేయలేడు..!

నేను☝🏻
మీ✍🏻
దేవేందర్ బండారి😎😁

తప్పు/నేరం

తెలియక చేస్తే పొరపాటు ...
 తెలిసి చేస్తే తప్పు ...
తప్పని తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరం .!! 

గుర్తుంచుకోండి...

నేను☝🏻
మీ✍🏻
 దేవేందర్ బండారి😎

It's CaRONA Time

It's CaRONA Time 

కోడలా కోడలా నీ భోగం ఎన్నాళ్లే అంటే...

క్వారంటైన్ కు వెళ్లిన అత్త తిరిగొచ్చే వరకూ అందట...
😌😁😊😅

నేను
మీ
దేవేందర్ బండారి😆😆