Take care of you

*ఉష కార్డియాక్ సెంటర్ విజయవాడ*
*హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ వై.వి.రావు గారు*

*గుండె ఆరోగ్యానికి ప్రశ్నలకి ఇచ్చిన*
*డాక్టర్ వై.వి.రావు గారుసలహాలు*

1) *ప్రశ్న . గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ?*

జవాబు :
1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనెలు
2) వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3) ధూమ పానం మానడం
4) బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం
5) బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం
.
2) *ప్రశ్న . కొవ్వును కండగా మార్చుకొగలమా ?*

జవాబు : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు – కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు . కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం . కొవ్వు కండగా మారదు

3) *ప్రశ్న : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?*

జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు . అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి .

4) *ప్రశ్న : గుండె పోటు వంశ పారం పర్యమా ?*

జవాబు : అవును

5) *ప్రశ్న : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )*

జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి . ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి .

6) *ప్రశ్న: ఆరోగ్య వంత మైన గుండె కోసం జాగ్గింగ్ , నడక రెండింటిలో ఏది ఉత్తమం ?*

జవాబు : నడక మంచిది . జాగ్గింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు

7) *ప్రశ్న : మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు ?*

జవాబు : మదర్ తెరెసా !
పేద ప్రజలు వారికీ సేవ చేయటం
మా హాస్పటల్ ముక్య ఉద్దేశం

8) *ప్రశ్న : లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?*

జవాబు : చాలా తక్కువ

9) *ప్రశ్న : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ?*
నా వయసు 22 to 30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా ?

జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది

10) *ప్రశ్న : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా ?*

జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు . ఆఅహారమ్ జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి .

11) *ప్రశ్న : మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?*

జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా

12) *ప్రశ్న : గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది ? చెడ్డ ఆహారం ఏది ?*

జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి . నూనెలు చెడ్డవి

13) *ప్రశ్న : ఏ నూనె మంచిది ? సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె , ఆలివ్ ఆయిల్ ?*

జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే

14) *ప్రశ్న : ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా ?*

జవాబు : రొటీన్ షుగర్ , బి . పి , కొలెస్టరాల్ చాలు . ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి
.
15) *ప్రశ్న : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి ?*

జవాబు : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి . ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి . మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .

16) *ప్రశ్న : గేస్ట్రిక్ నొప్పికీ – గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?*

జవాబు : ఈ సి జీ చూస్తే గానీ చెప్పలేము

17) *ప్రశ్న : యువకులలో గుండె వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 – 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )*

జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది . అందు వలన కేసులు కనిపిస్తున్నాయి . జీవన విధానం ( బద్ధకం ) , జంక్ ఫుడ్ , వ్యాయామం లేక పోవడం , పొగ తాగడం . మన దేశం లో జెనేటికల్ గా అమెరికా , యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ .
.
18) *ప్రశ్న : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా ?*

జవాబు : ఉంటారు

19) *ప్రశ్న : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు . వాస్తవమా ?*

జవాబు : వాస్తవమే ! దగ్గర సంబంధాల వలన కంజెనితల్ ఎబనార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు . మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరు పిల్లాడు పుట్టాక పోవచ్చు ( అందరూ నవ్వేరేమో ! )

20) *ప్రశ్న : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపం . నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం . ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?*

జవాబు : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది ఇటువంటి అసంబద్ధ జీవిత విధానానం నుండి . కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి .


మీ..‌

దేవెందర్ బండారి 🎶🎶🎶

No comments:

Post a Comment